Tuni: పోగొట్టుకున్న నగదు, బంగారాన్ని తిరిగి అప్పగించిన మహిళ
Tuni: తునిలో రూ.2 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు ఉన్న బ్యాగును పోగొట్టుకున్న దేవికి, తిరిగి అప్పగించి ఏడేలమ్మ అనే మహిళ తన నిజాయితీని చాటుకున్నారు.
Tuni: పోగొట్టుకున్న నగదు, బంగారాన్ని తిరిగి అప్పగించిన మహిళ
తుని: తునిలో ఒక మహిళ తన బ్యాగును పోగొట్టుకోగా, అది దొరికిన మరొక మహిళ నిజాయితీగా పోలీస్ స్టేషన్‌లో అప్పగించి అందరి మన్ననలు అందుకున్నారు.
శరభవరం గ్రామానికి చెందిన గోరంట్ల దేవి, రూ.2 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు మరియు రూ.21 వేల నగదు ఉన్న తన బ్యాగును తునిలో పొరపాటున పోగొట్టుకున్నారు. అది స్థానికంగా హెల్పర్ (డ్రైవర్స్ కాలనీకి చెందిన వాడబోయిన ఏడేలమ్మ)కు దొరకడంతో, ఆమె వెంటనే తుని పోలీస్ స్టేషన్‌లో అందజేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు, బాధిత మహిళను పిలిపించి ఆమె సామాగ్రిని సురక్షితంగా అందజేశారు. ఏడేలమ్మ నిజాయితీని మెచ్చుకుంటూ తుని సీఐ గీతారామకృష్ణ, ఎస్ఐ విజయబాబు ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు.
Next Story




