Prathipadu: బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు: బీఎస్పీ

Prathipadu: స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీఎస్పీ ప్రత్తిపాడు ఇంచార్జ్ గునపర్తి అపురూప్ డిమాండ్ చేశారు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 5 Oct 2026 3:21 PM IST
Prathipadu
X

Prathipadu: బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు: బీఎస్పీ

Prathipadu: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ గునపర్తి అపురూప్ డిమాండ్ చేశారు.

సోమవారం ప్రత్తిపాడులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాలని కోరారు

ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వంతో చర్చించి బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అంశానికి రాజ్యాంగపరమైన పరిష్కారం చూపాలని అన్నారు. అవసరమైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలను హైకోర్టు 50 శాతం రిజర్వేషన్ పరిమితి అంశంలో పక్కనపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి చర్యలను స్పష్టంగా ప్రకటించాలని కోరారు.

బీసీలకు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లను అమలు చేసేందుకు అవసరమైన డేటాను సేకరించి, రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఎస్పీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు గునపర్తి అపురూప్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షుడు కొంగు రమేష్, పిల్లి రాజు, మురా రాంబాబు, మురా సత్య రాజకుమార్, ప్రవీణ్, నూకరాజు, అప్పారావు, నాగబాబు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU