Kakinada: సామర్లకోటలో ఘనంగా యోగా దినోత్సవం.. పాల్గొన్న జేసీ అపూర్వ భరత్!
Kakinada: సామర్లకోట భీమేశ్వరాలయం వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం అన్న జేసీ అపూర్వ భరత్.
Kakinada: సామర్లకోటలో ఘనంగా యోగా దినోత్సవం.. పాల్గొన్న జేసీ అపూర్వ భరత్!
కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం, యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ లు అన్నారు.
మంగళవారం ఉదయం సామర్లకోట శ్రీ భీమేశ్వరాలయం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
పెద్ద ఎత్తున గ్రామంలోని ప్రజలు, వివిధ శాఖల అధికారులు యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్ డి ఓ కృష్ణమూర్తి, జడ్పీ సీఈవో లక్ష్మణరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు కంటే జగదీష్ మోహన్, ఈవో బల్ల నీలకంఠం, అడబాల కుమారస్వామి, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
Next Story




