Jaggampeta: గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అంగన్వాడీలు
Jaggampeta: జగ్గంపేటలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
Jaggampeta: గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అంగన్వాడీలు
జగ్గంపేట: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు 2019 నుండి వేతనాలు పెరగలేదని, ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, అంగన్వాడీలకు రకరకాల యాప్ లు తెచ్చి పని భారం పెంచారని, డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ ) ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
2014 నుండి ఇప్పటి వరకు కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా వేతనం పెంచలేదు అని అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు రూ.26,000/- ఇవ్వాలని డిమాండ్ చేసారు.హెల్బర్ల ప్రమోషన్స్ గైడ్లైన్స్ ఇచ్చిన జీవో 5 ను సవరించాలని, పెండింగ్ లో ఉన్న మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలని, 1972 పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటి చట్టం ప్రకారం సర్వీసులో ఉండి మధ్యలో మానేసి లేక చనిపోయిన వారికి కూడా గ్రాట్యూటీ అమలు చేయాలని, నవచేతన యాప్,ఐవిఆర్ యాప్ రద్దుచేయాలని, పెండింగ్లో ఉన్న టీఎ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ (సిఐటియు ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి ప్రాజెక్టు కోశాధికారి y v రాజేశ్వరి. జగదీశ్వరి. వెంకటలక్ష్మి సుజాత పద్మ తదితరులు పాల్గొన్నారు.




