Jaggampeta: జె.కొత్తూరు కనకదుర్గమ్మకు రూ.75 వేల వెండి ఖడ్గం బహుకరణ

Jaggampeta: జగ్గంపేట మండలం జె.కొత్తూరు శ్రీ కనకదుర్గమ్మకు దాతలు మడగల పెద్దకాపు (అప్పారావు) కుటుంబ సభ్యులు రూ.75 వేల విలువైన వెండి ఖడ్గాన్ని సమర్పించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 11 Oct 2026 6:29 PM IST
Jaggampeta
X

Jaggampeta: జె.కొత్తూరు కనకదుర్గమ్మకు రూ.75 వేల వెండి ఖడ్గం బహుకరణ

కాకినాడ జిల్లా, జగ్గంపేట: అక్టోబర్ 11 విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజు జగ్గంపేట మండలం *జె. కొత్తూరులో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి.

జె. కొత్తూరు గ్రామానికి చెందిన దాతలు మడగల పెద్దకాపు (అప్పారావు) - వరలక్ష్మి దంపతులు తమ కుమారులు నూకరాజు, సాయి లతో కలిసి అమ్మవారికి సుమారు రూ.75,000/- విలువైన వెండి ఖడ్గాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించి అలంకరించారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. వెండి ఖడ్గంతో అమ్మవారు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నక్కిరెడ్డి శివ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA