Jaggampeta: ఘనంగా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సత్కార సభ చంటిబాబు

Jaggampeta: జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. గత ఐదేళ్లుగా సేవలు అందించిన ప్రజాప్రతినిధులను సన్మానించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 2 Oct 2026 11:11 PM IST
Jaggampeta
X

Jaggampeta: ఘనంగా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సత్కార సభ చంటిబాబు

జగ్గంపేట: జగ్గంపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు ఆత్మీయ అనుబంధం వెల్లివిరిసింది. జగ్గంపేట మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట వారి పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సత్కార సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గలో ప్రజా సేవలో గత ఐదేళ్లుగా భాగస్వాములైన ZPTC లు, MPTC లు,మరియు సర్పంచ్ లకు ప్రజా సేవలో వారి కృషిని గుర్తిస్తూ, వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభను ఏర్పాటు చేయడం జరిగిందని,

గత ఐదేళ్లుగా నిరంతర సేవలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యలను జిల్లా వరకు కూడా తీసుకువెళ్లి వారికి ఇచ్చిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసిన వారిని సత్కరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని మరియు తమతో కలిసి ప్రజా సేవ చేసిన ప్రతి ఒక్కరినీ ఎప్పటికీ మర్చిపోలేమని, పార్టీ కోసం వారు చేసిన త్యాగం వెలకట్టలేనిదని మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, తెలిపారు. ఈ కార్యక్రమంలో, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, జ్యోతులు చంటిబాబు అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA