Jaggampeta: జగ్గంపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోరిన పల్లంరాజు
Jaggampeta: కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని గుర్తించి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం. పల్లంరాజు పిలుపు. జగ్గంపేటలో ఎన్నికల ప్రచారం, రోడ్‌షో.
Jaggampeta: జగ్గంపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోరిన పల్లంరాజు
జగ్గంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం లో జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి గోకవరం మండలాల జడ్పిటిసి అభ్యర్థులు తరఫున కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పల్లంరాజు స్థానిక జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరోతి శివగణేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు లతో కలసి ప్రచారం నిర్వహించారు అనంతరం స్థానిక జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు.
గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో జడ్పిటిసి అభ్యర్థి కోలపర్తి దుర్గ భూలక్ష్మి గృహం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం పెంటపల్లి గ్రామం నుండి రంపారం పాలెం గోకవరం మీదుగా కొత్తపల్లి గ్రామం వరకు రోడ్ షో నిర్వహించారు.
*ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య, రాజ్యాంగ అమలు లో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకమైనదని... భారతదేశంలో నిర్మాణం చేసిన అన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టులు, జలాశయంలు అనగా బాక్రానంగల్ ప్రాజెక్టు నుండి పోలవరం ప్రాజెక్టు వరకు కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమయ్యాయని... సంక్షేమం పేద బడుగు బలహీన వర్గాలకు భూములు ఇళ్లు నిర్మించినది కాంగ్రెస్ పార్టీ అని గుర్తించాలని అన్నారు.
ప్రపంచంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని, 13 కోట్ల ఓట్లు రద్దు చేయడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తి నశిస్తుందని, ఎలక్షన్ కమిషనర్లను ఎన్నుకునే విధానం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మార్పు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమలను దృష్టిలో పెట్టుకుని హస్తం గుర్తుపై ఓటు వేసి జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలాల జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని పల్లంరాజు జగ్గమని నియోజకవర్గ ప్రజలను కోరారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు, రైతు మహిళా ఉద్యోగ కార్మికకర్షగా వర్గాలకు మేలు జరుగుతుందని కాబట్టి జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలాల జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.
*జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివగణేష్ మాట్లాడుతూ కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ బేధాలు లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెక్యులర్ భావిజాలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాబట్టి హస్తం గుర్తుపై ఓటు వేసి జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి గోకవరం మండలాల జడ్పిటిసి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మట్టా శివప్రసాద్, జగ్గంపేట జెడ్పిటిసి అభ్యర్థి చంద్రమౌళి వెంకటరత్నం, గండేపల్లి మండలం జడ్పిటిసి అభ్యర్థి నక్క సత్యవతి, కిర్లంపూడి మండలం జడ్పిటిసి అభ్యర్థి బుద్ధ యతి రాజులు, గోకవరం మండలం జడ్పిటిసి అభ్యర్థి కోలపర్తి దుర్గా భూలక్ష్మి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గొంపా కొండబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల రత్నాజీ రావు, కోలపర్తి వీర వెంకటరావు,కొండా శ్రీను, బొల్లం బాపిరాజు,ఎగుపాటి మహేష్, పిల్లి నాగేశ్వరరావు, ఎర్రంపాలెం పంతులుగారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




