Kothapalli: కొత్తపల్లి మండల ZPTC అభ్యర్థి ఎంపిక కొలిక్కి?

Kothapalli: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల ZPTC అభ్యర్థి ఎంపికపై జనసేన కసరత్తు కొలిక్కి వచ్చింది. ZP చైర్మన్ సమీకరణం లేదా యువ నాయకత్వానికి ప్రాధాన్యత లభించే అవకాశం.

RAMA KRISHNA, KKD
Published on: 19 Oct 2026 9:03 PM IST
Kothapalli
X

Kothapalli: కొత్తపల్లి మండల ZPTC అభ్యర్థి ఎంపిక కొలిక్కి?

కొత్తపల్లి: కొత్తపల్లి మండల ZPTC అభ్యర్థి ఎంపిక విషయంలో జనసేన పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాకినాడ జిల్లా ZP చైర్మన్ పదవి జనసేనకు కేటాయించే పరిస్థితి ఏర్పడితే, చైర్మన్ అభ్యర్థిని కొత్తపల్లి మండలం నుంచి ZPTCగా బరిలోకి దింపే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ZP చైర్మన్ సమీకరణం కొత్తపల్లికి వర్తించని పక్షంలో, స్థానిక నాయకత్వానికే అవకాశం ఇవ్వడంతో పాటు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ రావు అక్షయ్ కుటుంబం లేదా జనసేన పార్టీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు సూర్య నిఖిల్ కుటుంబం నుంచి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే అభ్యర్థిత్వంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD