Pithapuram: పిఠాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన వ్యూహాత్మక భేటీ!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ–కొత్తపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఇన్‌చార్జుల సమావేశం జరిగింది.

V. Ramakrishna, Pithapuram
Published on: 16 Sept 2026 11:11 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన వ్యూహాత్మక భేటీ!

పిఠాపురం: ఉప్పాడ–కొత్తపల్లి రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉప్పాడ–కొత్తపల్లి మండలంలోని మత్స్యకార గ్రామాలైన ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, పొన్నాడ పంచాయతీల జనసేన ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. మండల జనసేన పార్టీ ఇన్‌చార్జ్ రావు అక్షయ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామాల్లోని పరిస్థితులు, ప్రజా సమస్యలు, స్థానిక ఎన్నికలపై చర్చించారు.

గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. రాబోయే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేస్తామని నాయకులు తెలిపారు. ఈ విజయాలను మన డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బహుమతిగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram