Razole: పవన్ కళ్యాణ్ కోసం జనసైనికుల పాదయాత్ర
Razole: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాజోలు జనసైనికులు 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
Razole: పవన్ కళ్యాణ్ కోసం జనసైనికుల పాదయాత్ర
Razole: రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు జనసైనికులు రాజోలు నుంచి అంతర్వేది వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర రాత్రంతా పాదయాత్ర చేసుకుంటు వెళ్లి ఈరోజు తెల్లవారుజామున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మరియు ఆంజనేయస్వామి వారికి తమలపాకులు, సింధూరంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో సుదర్శన హోమం జరిపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురై శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలో సేవలు అందించాలని మ్రొక్కులు చెల్లించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుండాబత్తుల తాతాజీ,కోళ్ల బాబి,నామన షణ్ముఖ, యెరుబండి చిన్ని, ఉలిశెట్టి లక్ష్మణరావు,ఉలిశెట్టి అన్నపూర్ణ,బొమ్మిడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.




