Peddapuram: మారిడమ్మ సేవలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు!
Peddapuram: పెద్దాపురం మారిడమ్మ అమ్మవారి శాఖంబరి ఉత్సవాల్లో కుటుంబసమేతంగా పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సమృద్ధిగా వర్షాల కోసం ప్రత్యేక పూజలు!
Peddapuram: మారిడమ్మ సేవలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు!
పెద్దాపురం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ మారిడమ్మ అమ్మవారు శాఖంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న సందర్భంగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రైతాంగానికి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు.ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, శాఖంబరి అమ్మవారు అన్నపూర్ణ స్వరూపిణిగా భక్తులను కరుణించే దైవమని, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సుభిక్షం నెలకొని ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలమరశెట్టి సత్తిబాబు, ఓబులిశెట్టి గున్ని, వంగలపూడి సతీష్,కఠారి శ్రీను, లక్ష్మణ్ దివాకర్ పాల్గొన్నారు.




