Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. భారీ వర్షాలకు గోడకూలి బాలుడు మృతి!
Kakinada: కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం చినవలసలలో భారీ వర్షానికి మట్టి గోడ కూలి మూడో తరగతి బాలుడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. భారీ వర్షాలకు గోడకూలి బాలుడు మృతి!
Kakinada: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూరిపాక మట్టి గోడ కూలి బాలుడు మృత్యువాత పడ్డ సంఘటన గాడిమొగ పంచాయితీ చినవలసల గ్రామంలో జరిగింది.
స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మల్లాడి లక్ష్మీనారాయణ(8) తన ఇంటి ఎదురుగా ఉన్న పాతబడిన ఇంటి వద్ద ఆడుకుంటున్న సందర్భంలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ గోడ మట్టిలో ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు.
తన బిడ్డ జాడ కనిపించడం లేదని వెతుకుతున్న తల్లికి ఇంటి ఎదురుగా గోడ క్రింద బిడ్డ కాళ్ల పాదాలు కనపడటంతో తల్లి జయలక్ష్మి భోరున విలపిస్తూ బంధువుల సహాయంతో బాలుడిని బయటకు తీసింది.
స్పృహ కోల్పోయి ఉన్న బాలుడు ని తాళ్ళరేవు సి హెచ్ సికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు.
గత రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయిన మహిళ ఇప్పుడు బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూన్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.




