Kakinada: బీజేపీలో చేరిన ‘ఎం.కె టీం’ అధినేత కర్రి సూర్య మణికంఠ

Kakinada: కాకినాడ జిల్లా బీజేపీలో చేరిన ప్రముఖ యువ వ్యాపారవేత్త, ‘ఎం.కె.టీం’ అధినేత కర్రి సూర్య మణికంఠ.

NARAYANA, RAJANAGARAM
Published on: 21 Jun 2026 8:21 PM IST
Kakinada
X

Kakinada: బీజేపీలో చేరిన ‘ఎం.కె టీం’ అధినేత కర్రి సూర్య మణికంఠ

Kakinada: గోకవరం గ్రామానికి చెందిన యువ వ్యాపారవేత్త, ఎం.కె.టీం అధినేత కర్రీ సూర్య మణికంఠ ఆదివారం కాకినాడ జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.గోకవరం మండలంలో ఆయనఎం.కె టీం అనే సంస్థను ప్రారంభించి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువతకు బాసటగా నిలుస్తున్నారు.

నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల బిజెపి సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై బిజెపి ద్వారా సమాజానికి సేవ చేయాలని సంకల్పంతో బిజెపిలో చేరాలని నిర్ణయించుకుని మండల బిజెపి అధ్యక్షులు ఇనకోటి బాప న్న దొరతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం మండలంలో సీనియర్ బిజెపి నాయకులు మట్టా మంగరాజు, సత్తి వెంకటరెడ్డి, కోనా వెంకట సురేష్ ల ఆధ్వర్యంలో కాకినాడ వెళ్లి జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు సమక్షంలో కర్రీ సూర్య మణికంఠ బిజెపిలో చేరారు.

ఆయనకు జిల్లా అధ్యక్షులు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వర రావు, బిజెపి సీనియర్ నాయకులు మట్ట మంగరాజు మాట్లాడుతూ కర్రి సూర్య మణికంఠ లాంటి యువ నాయకులు స్వచ్ఛందంగా బిజెపిలోకి రావడం శుభ పరిణామమని,

ఆయన యువతను బిజెపి వైపు ఆకర్షించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కర్రీ సూర్య మణికంఠ తో పాటు, కుప్పాల వీరబాబు,గోపాల్ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు పీతా సత్యనారాయణ ఉంగరాల ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story