Pithapuram: పిఠాపురంలో పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వర్షాల కారణంగా మునిగిపోయిన పంటలను కలెక్టర్ పరిశీలించి, గ్రామ సమస్యలు మరియు రైతుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు.
Pithapuram: పిఠాపురంలో పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గము. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ , తన సొంత నియోజకవర్గంలోని ఏ రైతు నష్టపోకుండా చూడాలని కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఈరోజు మన గ్రామానికి కాకినాడ జిల్లా కలెక్టర్ విచ్చేసి, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మునిగిపోయిన పంటలను పరిశీలించారు. రైతులకు పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మన గ్రామంలోని పలు ముఖ్యమైన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
పుంత రోడ్ల అభివృద్ధి:
మన గ్రామంలోని పుంత రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించి, వర్షపు నీరు మరియు వేస్ట్ వాటర్ సక్రమంగా వెళ్లేందుకు రోడ్లకు ఇరువైపులా కాలువలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
పొలిమేర కాలువ అభివృద్ధి:
మన గ్రామ చెరువు నుంచి కలింగలు వచ్చే నీరు, దొంతమూరు చెరువు నుంచి వచ్చే నీరు, వెల్దుర్తి కాలువ నుంచి వచ్చే నీరు—ఈ మూడు కాలువల ద్వారా వచ్చే నీరంతా పొలిమేర కాలువలోకి చేరుతున్నందున, కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఆ కాలువను తవ్వించి అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది.
దొంతమూరు బ్రిడ్జి – శుద్ధగడ్డ రహదారి:
దొంతమూరు బ్రిడ్జి దగ్గర నుంచి శుద్ధగడ్డ వరకు ఉన్న మట్టి రోడ్డును ఎత్తు చేసి, పుంత రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది.
స్మశానవాటికల అభివృద్ధి:
మన గ్రామంలోని OC స్మశానవాటిక మరియు SC స్మశానవాటిక అభివృద్ధి గురించి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
వాకింగ్ ట్రాక్, పార్క్ మరియు పిల్లల ఆటస్థలం:
గతంలో మంజూరైన వాకింగ్ ట్రాక్, పార్క్, పిల్లల ఆటస్థలానికి సంబంధించిన గ్రాంట్ కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లినందున, తిరిగి కొత్త గ్రాంట్ మంజూరు చేయాలని కోరడం జరిగింది.
స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి:
మన గ్రామంలోని స్కూల్ గ్రౌండ్ లోతుగా ఉన్నందున, దానిని మట్టి వేయించి ఎత్తు చేసి అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. ఈ విధంగా మన గ్రామానికి సంబంధించిన అనేక ముఖ్యమైన సమస్యలను కలెక్టర్ కి వివరంగా తెలియజేసి, త్వరలోనే అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.
మన సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, త్వరలోనే అవసరమైన పనులకు శాంక్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పి. రాయవరం నీటి సంఘం అధ్యక్షులు కారపురెడ్డి కృష్ణ , పాడా పీడీ , పిఠాపురం వ్యవసాయ సహాయ అధికారి శ్రీమతి స్వాతి , ఏవో గంగాధర్ , ఆర్‌ఏ , పి. రాయవరం జనసేన పార్టీ నాయకులు కారపురెడ్డి వెంకటేష్ , మన గ్రామ సచివాలయ సిబ్బంది వీఆర్వో సత్యనారాయణ , అగ్రికల్చర్ అసిస్టెంట్ ధర్మ , జనసేన నాయకులు, జనసైనికులు, రైతులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మన గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాము.




