Jaggampeta: జగ్గంపేటలో జోరందుకున్న కూటమి సర్పంచ్ అభ్యర్థిని ప్రచారం!

Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిని పాండ్రంగి సురేఖ రాంబాబు ఇంటింటి ప్రచారం జోరందుకుంది. గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పాండ్రంగి రాంబాబు తెలిపారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 18 Nov 2026 1:50 PM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేటలో జోరందుకున్న కూటమి సర్పంచ్ అభ్యర్థిని ప్రచారం!

జగ్గంపేట: జగ్గంపేట కూటమి సర్పంచ్ అభ్యర్థిని పాండ్రంగి సురేఖ రాంబాబు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా సురేఖ రాంబాబుకు మహిళలు పూలమాలలతో మంగళ హారతులతో జననీరాజనం పడుతున్నారు.

ఈ సందర్భంగా పాoడ్రoగి రాంబాబు మాట్లాడు తూ నేను జగ్గంపేట లో గత 15సంవత్సరాలనుండి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా, జగ్గంపేట హాస్పిటల్ కమిటీ నెంబర్ గా పనిచేస్తున్నానుఅలాగే నా సతీమణి పాండ్రంగి సురేఖ రాంబాబుని కూటమి తరఫున జగ్గంపేట సర్పంచ్ అభ్యర్థిని గా పోటీచేస్తునందున ఇంటింటి ప్రచారంలో అద్భుతమైన స్పందన ఇస్తున్నారు.

రేపు అనగా 19వ తారీకున నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా జగ్గంపేట ప్రజలందరు నా భార్యని ఆశీర్వదించి, నామినేషన్ వేసిన తర్వాత వచ్చిన గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి మీ వంతు సలహాలు సూచనలు ఇస్తారని మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి జగ్గంపేట సర్పంచ్ అభ్యర్థిని గా అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA