Kakinada: కాకినాడలో అక్రమ రొయ్యల చెరువుల రగడ.. గ్రామస్తుల ఆందోళన!
Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
Kakinada: కాకినాడలో అక్రమ రొయ్యల చెరువుల రగడ.. గ్రామస్తుల ఆందోళన!
Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో అక్రమ రొయ్యల చెరువుల త్రవ్వకాలు వద్ద తీవ్ర ఉద్రిక్తత. ప్రోక్లైనర్ కు అడ్డుగా నిలిచి అక్రమ రొయ్యల చెరువుల త్రవ్వకాలను అడ్డుకున్న అయితపూడి గ్రామస్తులు. చెరువులు త్రవ్వే యజమాని అనుచరులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వివాదం.
అక్రమ రొయ్యల చెరువుల త్రవ్వకాలు వద్ద ఆందోళన నిర్వహించిన గ్రామస్తులు. అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలి, సాగు నీరు, త్రాగు నీరు కు ఇబ్బంది కలిగించే చెరువులు మాకొద్దు.. మాకొద్దు.. అంటూ నినదించిన గ్రామస్తులు. అక్రమ రొయ్యల చెరువు ల తవ్వకాల వల్ల గ్రామంలో సాగునీరు, త్రాగునీరు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.
రొయ్యల చెరువుల వల్ల భూగర్భ జలాలు కలుషితమై ప్రజల అనారోగ్య పాలవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. అక్రమ రొయ్యల చెరువులు వల్ల సమీపంలో ని వ్యవసాయ భూములు పాడై వ్యవసాయ దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఈ అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలపై అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించలేదని,
ఇప్పటికైనా స్పందించి అక్రమ రొయ్యల చెరువులను త్రవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. అక్రమ రొయ్యల చెరువుల వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా గొల్లపాలెం పోలీస్ స్టేషన్ కు రప్పించి ఇరు వర్గాలతో చర్చలు జరిపిన పోలీసులు.




