Jaggampeta: జగ్గంపేటలో కూటమి సర్పంచ్ అభ్యర్థి సురేఖ రాంబాబు ప్రచార జోరు!

Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాండ్రంగి సురేఖ రాంబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 13 Nov 2026 6:59 PM IST
Jaggampeta
X

Jaggampeta: జగ్గంపేటలో కూటమి సర్పంచ్ అభ్యర్థి సురేఖ రాంబాబు ప్రచార జోరు!

జగ్గంపేట: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు బలపరిచిన జగ్గంపేట సర్పంచ్ అభ్యర్థి పాండ్రంగి సురేఖ రాంబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లినా గ్రామ ప్రజలు పూలమాలలతో, మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ జననీరాజనాలు పలుకుతున్నారు.

ఈ సందర్భంగా సురేఖ రాంబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులతో జగ్గంపేట సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు నన్ను బలపరిచాయి. మీ చల్లని ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నాం. రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తే జగ్గంపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.

త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం ఇలా అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ మీ మన్ననలు పొందుతాం. ప్రభుత్వం అండ కూడా మాపై ఉంది. ఇవన్నీ చేయగల సమర్థత ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం అని అన్నారు.

ప్రచార కార్యక్రమంలో జడ్పిటిసి జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, దేవరపల్లి మూర్తి, రాయి సాయి, కేంగం రామకృష్ణ, మారిశెట్టి గంగ నూతనంగా విజయం సాధించిన ఎంపీటీసీలు అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA