Kakinada: రాఖీ పండుగ వేళ సోదరుడిలా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Kakinada: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి వితంతు ఆడపడుచులకు రాఖీ కానుకగా చీరలు పంపిణీ చేశారు.
Kakinada: రాఖీ పండుగ వేళ సోదరుడిలా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
Kakinada: జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రాఖీ పండుగను పురస్కరించుకుని వితంతు ఆడపడుచులకు 20 నుండి 45 సంవత్సరాల లోపు వయసుగల మహిళలకు ఇంటింటికి వెళ్లి జనసేన నాయకులు కాకినాడ జిల్లా అధ్యక్షులు, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, పిఠాపురం పట్టణ ఇంచార్జ్ డా చిక్కాల వరలక్ష్మి చేతుల మీదుగా చీరల పంపిణీ చేయడం జరిగింది.
పిఠాపురం నియోజవర్గం మొత్తం సుమారు 2800 చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ప్రతి వార్డ్ ఇంచార్జ్ మరియు వీర మహిళలు చేతులమీదుగా అందివ్వడం జరిగింది.పిఠాపురం పట్టణంలో గల 30 వార్డుల్లో 20, 21, 22, మరియు 10,11 వార్డుల్లో మహిళలు మాట్లాడుతూ ఇటువంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మాకు సొంత సోదరుల చీరలు అందివ్వడం చాలా ఆనందదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వార్డు ఇన్చార్జిలు, వీర మహిళలు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




