Kakinada: కాకినాడలో సాఫ్ట్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి ఎంపికలు
Kakinada: కాకినాడ డీఎస్సీ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ జట్ల ఎంపికల ట్రయల్స్. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, శ్యామలాదేవి హాజరు.
Kakinada: కాకినాడలో సాఫ్ట్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి ఎంపికలు
కాకినాడ: రాష్ట్ర జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి జట్ల ఎంపికల ట్రయల్స్ శనివారం కాకినాడ డీఎస్సీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, విశిష్ట అతిథిగా మాజీ కాకినాడ పార్లమెంట్ సభ్యుడు ఉప్పలపాటి కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను కూడా అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. శ్యామలాదేవి మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, కాకినాడతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన భర్త కృష్ణంరాజుకు క్రీడలపై ఎంతో మమకారం ఉండేదని, క్రీడల్లో రాణించే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటానని తెలిపారు.
కాకినాడ నుంచి వివిధ రంగాల్లో ఎంతోమంది ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. బిజెపి నాయకుడు ఎన్.వి. సాయిబాబు మాట్లాడుతూ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్యామలాదేవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థులు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా తల్లిదండ్రులు ప్రోత్సహించి వారికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్డీఓ కాకినాడ డి. సతీష్‌కుమార్, సత్య స్కానింగ్ సీఈఓ కాదా వెంకట రమణ, చిక్కాల తాతాజీ, ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ నవీన్‌కుమార్, అధ్యక్షుడు శ్రీనుబాబు, కోశాధికారి బి. నీరజ, డీఈఓ రమేష్, డీవైఈఓ కె.వి.వి. సత్యనారాయణ, పి. శ్రీనివాస్, వి. మాచిరావు, కె. నాగలింగేశ్వరరావు, కె. శ్రీనివాసరావు, పి. సుధారాణి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.




