Kakinada: మురారి బడిలో 'మెగా పీటీఎం 4.0' – పాల్గొన్న ఎమ్మెల్యే

Kakinada: గండేపల్లి మండలం మురారి జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన మెగా పీటీఎం 4.0 లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 24 July 2026 9:35 PM IST
Kakinada
X

Kakinada: మురారి బడిలో 'మెగా పీటీఎం 4.0' – పాల్గొన్న ఎమ్మెల్యే

కాకినాడ: గండేపల్లి మండలం మురారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ ఇంచార్జి, గ్రామ నాయకులు జాస్తి వసంత్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.లక్ష్మీ, విద్యా కమిటీ చైర్మన్ సుంకవిల్లి శ్రీనివాస్అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎమ్మెల్యే నెహ్రూ విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహబంతి భోజనం చేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చాలా వైభవంగా నిర్వహిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నారా లోకేష్ విద్యార్థులలో నైపుణ్యం పెంచడానికి , సృజనాత్మకత పెంచడానికి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేసిందని,

సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసిందని, చదువుకున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయలు జమ చేశారని, పరీక్షల్లో ఉత్తమమైన ఫలితాలు కనబరిచిన వారిని గుర్తించి షైనింగ్ స్టార్ అవార్డులు పేరిట సత్కరించారని తెలిపారు..ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చిందని.

అందులో భాగంగా నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషకరమన్నారు..విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే లక్ష్యంతో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం నెలకొల్పడానికి మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, రాష్ట్ర డైరెక్టర్లు పోతుల మోహనరావు, కొత్త కొండబాబు గండేపల్లి సొసైటీ చైర్మన్ కంటిపూడి సత్యనారాయణ, మురారి సొసైటీ చైర్మన్ చావ తమన్న చౌదరి, ఎండిఓ హరికృష్ణ సత్యరెడ్డి, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA

Next Story