U Kothapalli: యు. కొత్తపల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ ఉదయ్

U Kothapalli: కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ యు. కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, వాకతిప్ప పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, శతశాతం పోలింగ్‌కు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

RAMA KRISHNA, KKD
Published on: 5 Nov 2026 2:41 PM IST
U Kothapalli
X

U Kothapalli: యు. కొత్తపల్లిలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ ఉదయ్

U Kothapalli: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, వాకతిప్ప గ్రామాల్లో పర్యటించి వివిధ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను సమీక్షిస్తూ, ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని, పోలింగ్ ముగిసే వరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే కొత్తపల్లి మండలంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు, జనసేన పార్టీ తరఫున బరిలో ఉన్న శ్రీమతి తెలగంశెట్టి శ్యామల కి ప్రజల మద్దతు లభించేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ , పార్టీ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు , గంటా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD