Tuni: తునిలో జనసేన విజయం తథ్యం: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్!

Tuni: తుని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన చైర్మన్ అభ్యర్థి శరకణం శ్రీలత విజయం ఖాయమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తూ ముమ్మర ప్రచారం చేశారు.

MANIKANTA, TUNI
Published on: 23 Oct 2026 10:31 PM IST
Tuni
X

Tuni: తునిలో జనసేన విజయం తథ్యం: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్!

తుని: త్వరలో జరగనున్న తుని పురపాలక సంఘం ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, చైర్మన్ పీఠంతో పాటు అన్ని వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందుతారని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ధీమా వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన తుని పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో తుని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ యనమల కృష్ణుడు గారు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి శరకణం శ్రీలత గారికి మద్దతుగా పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్ నుంచి గురు వీధి వరకు సాగిన ఈ ప్రచారంలో వారు ఇంటింటికీ తిరిగి ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమం, పట్టణ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. రానున్న పురపాలక ఎన్నికల్లో జనసేన, కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు, తుని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ పోల్నాటి శేషగిరిరావు గారు, శ్రీ చోడిశెట్టి త్రిమూర్తులు స్వామి గారు, శ్రీ చోడిశెట్టి గణేష్ గారు, శ్రీమతి సుంకర కృష్ణవేణి గారు, శ్రీ దుగ్గన బాబ్జి గారు, డాక్టర్ చిట్ల కిరణ్ గారు, శ్రీ అడబాల సత్యనారాయణ గారు, వివిధ వార్డుల జనసేన కౌన్సిలర్ అభ్యర్థులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI