Kakinada: గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

Kakinada: కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చొరవతో గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. పి.రాయవరం సచివాలయంలో కిట్లు పంపిణీ చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 1 Sept 2026 6:46 PM IST
Kakinada
X

Kakinada: గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, పిఠాపురం నియోజకవర్గ సోదరీమణులకు అన్నగా అండగా ఉంటూ వారి ఆరోగ్యం, సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.

కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని గర్భిణీ మహిళల ఆరోగ్యం, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చొరవతో కీలక కార్యక్రమం చేపట్టారు.

GAIL India Limited ద్వారా రూ.1 కోటి CSR సహాయంతో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 2,210 మంది గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్లు అందించనున్నారు, ఇందులో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1,500 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.

మా పి.రాయవరం గ్రామం నుంచి 13 లబ్ది పొందునున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం పి రాయవరం గ్రామ సచివాలయం లో జరిగిన కార్యక్రమంలో పి రాయవరం గ్రామ జనసేన పార్టీ ఇంచార్జ్ మాదేపల్లి పద్మావతి

పి రాయవరం నీటి సంఘం అధ్యక్షులు కారపురెడ్డి కృష్ణ రాయవరం జనసేన పార్టీ నాయకులు కారపురెడ్డి వెంకటేష్ గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు*.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, జనసైనికులు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మెడికల్ డిపార్ట్మెంట్, సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story