Peddapuram: పెద్దాపురం మండలం గుడివాడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత!
Peddapuram: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గుడివాడ పోలింగ్ కేంద్రం వద్ద అంబటి వినయ్ అనే వ్యక్తి థార్ వాహనంతో రాష్ డ్రైవింగ్ చేస్తూ గ్రామస్థులను ఢీకొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
Peddapuram: పెద్దాపురం మండలం గుడివాడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత!
పెద్దాపురం: గుడివాడ పోలింగ్ కేంద్రం వద్ద అంబటి వినయ్ అనే వ్యక్తి తన థార్ వాహనంతో రాష్ డ్రైవింగ్ చేస్తూ ఓటర్లను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడు. పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వస్తున్న వారి పట్ల నిర్లక్ష్యంగా వాహనం నడపడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదేంటని ప్రశ్నించిన గ్రామస్తులపై వినయ్ దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా, ప్రశ్నించిన వారిపైకి కారును ఎక్కిస్తానంటూ బెదిరించడంతో అక్కడ ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో తనకు అడ్డంగా ఉన్న కొందరు గ్రామస్తులను కారుతో ఢీకొడుతూ వినయ్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. ఈ ఘటనలో పలువురు గ్రామస్తులకు స్వల్పగాయాలయ్యాయి.
అయితే, ఈ ఘటనలో ఘర్షణకు దిగిన రెండు వర్గాలు కూడా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ వర్గీయుల మధ్యే ఇలాంటి ఘర్షణ జరగడంపై గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.




