Pithapuram: పిఠాపురంలో జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన ఉమ్మిడి జాన్!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మత్స్యకార నేత, మాజీ సర్పంచ్ ఉమ్మిడి జాన్ వంగా గీత సమక్షంలో వైసీపీలో చేరారు.
Pithapuram: పిఠాపురంలో జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన ఉమ్మిడి జాన్!
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.గత ఎన్నికల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసిన మత్స్యకార నాయకుడు, మాజీ సర్పంచ్ ఉమ్మిడి జాన్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉప్పాడ గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మెరుగు ఎల్లాజీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ వంగా గీత సమక్షంలో ఉమ్మిడి జాన్ అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 100 మంది జనసేన నాయకులు, కార్యకర్తలకు వంగా గీత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ, ఉప్పాడ ప్రాంత మత్స్యకారులకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.




