Kakinada: కిర్లంపూడి హైవేపై డ్రగ్స్ హల్చల్ 52 కిలోల గంజాయి స్వాధీనం

Kakinada: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో పోలీసుల ఈగిల్ టీం మెరుపు దాడి. జాతీయ రహదారిపై ట్రాక్టర్ లో తరలిస్తున్న 52.7 కిలోల గంజాయి స్వాధీనం, ఒకరి అరెస్ట్.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 7 July 2026 9:35 AM IST
Kakinada
X

Kakinada: కిర్లంపూడి హైవేపై డ్రగ్స్ హల్చల్ 52 కిలోల గంజాయి స్వాధీనం

కాకినాడ: కాకినాడ జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్, IPS వారి ఆదేశాల మేరకు, పెద్దాపురం సబ్-డివిజనల్ పోలీసు అధికారి శ్రీ A.B.G. తిలక్ పర్యవేక్షణలో, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. తిరుపతి రావు ఆధ్వర్యంలో, కిర్లంపూడి పోలీసులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈగిల్ టీం సహకారంతో నిర్వహించిన ప్రత్యేక దాడిలో భారీ మొత్తంలో కమర్షియల్ క్వాంటిటీ గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈగిల్ టీం మరియు పోలీసు సిబ్బందితో కలిసి కిర్లంపూడి మండలం, బూరుగుపూడి గ్రామ శివారులోని ఎన్.హెచ్.-16 రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల భాగంగా AP 39 TK 3260 నంబరు గల ఆకుపచ్చ రంగు ట్రాక్టర్ను ఆపి పరిశీలించగా, ట్రాక్టర్కు అమర్చిన BULLAGRO యంత్రంలో రహస్యంగా దాచిన 25 ప్యాకెట్లలో మొత్తం 52.7 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే గంజాయి, ట్రాక్టర్, BULLAGRO యంత్రాన్ని స్వాధీనం చేసుకొని, కూచిపూడి ఫ్రాన్సిస్ age 57 కట్టుబడిపాలెం గ్రామం గన్నవరం మండలం కృష్ణా జిల్లా కు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు రిమాండ్ కు తరలించడం జరిగింది.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story