Kakinada: వాకలపూడిలో మహిళా యోగా సెంటర్ ప్రారంభం

Kakinada: మహిళల ఆరోగ్యం కోసమే ప్రత్యేక యోగా కేంద్రం: రూ.45 లక్షల సిఎస్‌ఆర్ నిధులతో నిర్మాణం.. ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ.

TRIMURTULU, KOTHAPETA
Published on: 21 Jun 2026 3:15 PM IST
Kakinada
X

Kakinada: వాకలపూడిలో మహిళా యోగా సెంటర్ ప్రారంభం

Kakinada: మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో కాకినాడ రూరల్ మండలం వాక లపూడి గ్రామంలో 45 లక్షల రూపాయలతో యూనివర్సల్ బయో ఫ్యూల్స్ సిఎస్ఆర్ నిధులతో ఎనిమిది నెలల కాలంలోనే మహిళలకు ఉపయోగపడే విధంగా యోగా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే వలస పాకల వాకలపూడి తదితర గ్రామాల నుంచి యోగా చేసుకునే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని యోగ సెంటర్లో ఏర్పాటుచేసిన యూనివర్సల్ బయో ఫ్యూల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.

గ్రామ కార్యదర్శి పి పి రంగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి యోగ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం యూనివర్సల్ బయో ఫ్యూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సంజీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపుమేరకు పంచాయతీ ఇచ్చిన రెండు వందల యాభై గజాల స్థలంలో 45 లక్షల ఓ యోగా సెంటర్ ను మహిళలకు ఉపయోగపడే విధంగా అన్ని హక్కులతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

అలాగే పండూరు సిపిడబ్ల్యూఎస్ స్కీం 20 లక్షల రూపాయలతో ఫిల్టర్ బెడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు యోగ సెంటర్ ను మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఈరోజు ప్రారంభించడం ఆనందదాయమన్నారు.

ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శ్రీనివాస బాబా, చప్పిడి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, నందిపాటి త్రిమూర్తులు,యూనివర్సల్ బయో ఫూల్స్ హెచ్ఆర్ మేనేజర్ సత్య గంగాధర్ రావు, ప్రొడక్షన్ మేనేజర్ గోవిందరాజులు, యోగా గురువు సత్యనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA

Next Story