Samalkot: కార్తీక మొదటి సోమవారం: సామర్లకోట ఆలయంలో భక్తుల రద్దీ!

Samalkot: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 16 Nov 2026 11:15 AM IST
Samalkot
X

Samalkot: కార్తీక మొదటి సోమవారం: సామర్లకోట ఆలయంలో భక్తుల రద్దీ!

సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట కార్తీక మాసం మొదటి సోమవారం మరియు శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో సామర్లకోట లో గల పంచారామా క్షేత్రం బాల సుందరి సమేత చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం లో భక్తుల రద్దీ నెలకొంది.

సోమవారం తెల్లవారుజాముండే జిల్లా నలుమూల నుండి శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని ఆలయ కోనేరులో పుణ్యస్నానం ఆచరించి భీమేశ్వర స్వామివారిని బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.

పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో భీమేశ్వరాలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది.ఆలయ ఈవో బల్ల నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ఆలయ పండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

మరో పక్క ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున కార్తీకదీపాలను వెలిగించి మ్రొక్కులు చెల్లించుకుని పూజలు చేపట్టారు.ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM