Kakinada: కాకినాడ జిల్లాలో విజయోత్సవ ర్యాలీలపై పోలీసుల ఆంక్షలు!

Kakinada: కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని ఎస్పీ జి. బిందు మాధవ్ హెచ్చరిక.

RAMA KRISHNA, KKD
Published on: 3 Nov 2026 8:55 AM IST
Kakinada
X

Kakinada: కాకినాడ జిల్లాలో విజయోత్సవ ర్యాలీలపై పోలీసుల ఆంక్షలు!

కాకినాడ: మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానికి వీల్లేదని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులు కానీ, వారి అనుచరులు కానీ బాణసంచా కాల్చడం, బహిరంగంగా గుమిగూడి వేడుకలు జరుపుకోవడం, ర్యాలీలు తీయడం వంటివి పూర్తిగా నిషేధించబడినట్లు తెలిపారు.

జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఫలితాల లెక్కింపు సమయం నుంచి జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD