Kakinada: కాకినాడ జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట పోలీసు భద్రత
Kakinada: కాకినాడ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు. తుని, పిఠాపురం, సామర్లకోట కేంద్రాల వద్ద నిఘా: ఎస్పీ జి. బిందు మాధవ్.
Kakinada: కాకినాడ జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట పోలీసు భద్రత
కాకినాడ: కాకినాడ జిల్లాలో నవంబర్ 03వ తేదీన తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలతో పాటు ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీలకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడమైనదని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ తెలిపారు.
పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశాలు
కౌంటింగ్ కేంద్రాలను సంబంధిత ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద బహుళ అంచెల తనిఖీ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అగ్గిపెట్టెలు, లైటర్లు, సిరా, మండే స్వభావం కలిగిన పదార్థాలు, నిషేధిత ద్రవ పదార్థాలు లేదా అల్లర్లు, విధ్వంసక చర్యలకు ఉపయోగపడే ఇతర వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్ల ప్రవేశం, నిష్క్రమణ నిబంధనలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా అమలు చేయాలని, బ్యాలెట్ పేపర్లు, కౌంటింగ్ సామగ్రి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనుమతి కలిగిన వ్యక్తులను మాత్రమే గుర్తింపు కార్డుల పరిశీలన, తనిఖీల అనంతరం లోపలికి అనుమతించాలని, కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బారికేడ్లు, తగిన లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బందోబస్తులో పాల్గొనే ప్రతి పోలీసు సిబ్బందికి చేపట్టాల్సిన విధి విధానాలపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలని, అవసరమైన రిజర్వ్ బలగాలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT) సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని, ఏ చిన్న నిర్లక్ష్యానికి కూడా తావులేకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.




