Kakinada: గొల్లప్రోలు, పిఠాపురంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పీ బిందు మాధవ్!
Kakinada: కాకినాడ జిల్లా గొల్లప్రోలు, పిఠాపురంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్.
Kakinada: గొల్లప్రోలు, పిఠాపురంలో పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పీ బిందు మాధవ్!
Kakinada: కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల్లోని పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి, పోలింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
మొదట గొల్లప్రోలులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న ఏఆర్ డీఎస్పీ వి.జి. శ్రీహరి రావు, సీఐ చైతన్య కృష్ణ, గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
అనంతరం పిఠాపురంలోని ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ ప్రక్రియను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న కాకినాడ డీఎస్పీ ఎన్.ఎస్.వి.కె. దుర్గారావు, పిఠాపురం సీఐ జి.వి.వి. సత్యనారాయణ, పిఠాపురం టౌన్ ఎస్సై శ్రీ వి. మణికుమార్ మరియు ఇతర అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో అమలులో ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని, అనధికార వ్యక్తులు గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పర్యటనలో ఎస్పీ గారి వెంట ఎస్బీ డీఎస్పీ శ్రీ కె.వి.వి. సత్యనారాయణ, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ పి.వి. త్రినాథ్ మరియు ఇతర సిబ్బంది ఉన్నారు.




