Kakinada: పెద్దాపురం మరిడమ్మ తల్లి మాలధారణ నూతన వస్త్రాలు విడుదల!

Kakinada: పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి శరన్నవరాత్రుల మాలధారణ కార్యక్రమానికి సంబంధించిన నూతన వస్త్రాలను టీడీపీ నేత రాజా సూరిబాబు రాజు కార్యాలయంలో విడుదల చేశారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 8 Oct 2026 7:17 PM IST
Kakinada
X

Kakinada: పెద్దాపురం మరిడమ్మ తల్లి మాలధారణ నూతన వస్త్రాలు విడుదల!

Kakinada: పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి మాలధారణ కార్యక్రమానికి సంబంధించిన నూతన వస్త్రాలను టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు కార్యాలయం వద్ద విడుదల చేశారు....

ఆలయ నిర్వహణాధికారిణి శ్రీమతి కే. విజయలక్ష్మి మరియు వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి మాలధారణ సంప్రదాయాన్ని భక్తుల కోరిక మేరకు పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావడానికి ఆలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు....

ఈ సందర్భంగా ఆలయ నిర్వహణాధికారిణి కే. విజయలక్ష్మి మాట్లాడుతూ.. పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి మాలధారణ సంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిందని తెలిపారు. భక్తుల కోరిక మేరకు 2026 అక్టోబర్ 11వ తేదీ నుంచి శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మాలధారణ చేసే భక్తులు తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో మాలను ధరించి, విజయదశమి మరుసటి రోజు మాల విరమణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమ్మవారి మాలధారణ చేయదలచిన పెద్దాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు ఆలయం వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని ఆమె కోరారు.....

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM