Kakinada: 'అర్నబ్' తుఫాను హెచ్చరికలు తొండంగిలో 27 పునరావాస కేంద్రాలు!
Kakinada: కాకినాడ జిల్లా తొండంగి మండలంలో 'అర్నబ్' తుఫాను ముందస్తు చర్యలు. 510 బోట్లు సురక్షిత లంగరు, తీరప్రాంత ప్రజల కోసం 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు.
Kakinada: 'అర్నబ్' తుఫాను హెచ్చరికలు తొండంగిలో 27 పునరావాస కేంద్రాలు!
కాకినాడ జిల్లా: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తొండంగి మండల యంత్రాంగం అప్రమత్తమైందని, తీరప్రాంత ప్రజల రక్షణ కోసం అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తొండంగి తహశీల్దార్ (MRO) తెలిపారు. మండలంలో తుఫాను పరిస్థితులు, సహాయక చర్యలపై ఆయన మాట్లాడుతూ..
కీలక వివరాలను వెల్లడించారు:
మండల పరిధిలోని 4 రెవెన్యూ గ్రామాలు మరియు 7 పంచాయతీల పరిధిలో ఉన్న 34 హ్యాబిటేషన్స్ (నివాస ప్రాంతాలు) కాస్టల్ ఏరియా కింద తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని MRO తెలిపారు. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశామన్నారు.
మత్స్యశాఖ అధికారుల (FDO) సహకారంతో ఇప్పటివరకు మొత్తం 510 బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి వొడ్డు (Anchor) చేయడం జరిగిందని వెల్లడించారు. గ్రామ రెవెన్యూ అధికారులు (VROs), సచివాలయ సిబ్బంది మరియు ఫిషరీస్ అసిస్టెంట్లతో కలిసి మత్స్యకారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
తీరప్రాంత ప్రజల కోసం ముందస్తుగా 27 పునరావాస కేంద్రాలను (Shelter Homes) ఏర్పాటు చేసినట్లు MRO వెల్లడించారు. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, తీరప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాల్లోని ఈ పునరావాస కేంద్రాలకు రావాల్సిందిగా కోరమన్నారు.
పునరావాస కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, మంచి నీరు వంటి అన్ని వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.




