Kakinada: తుని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం!
Kakinada: కాకినాడ జిల్లా తుని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 36 వార్డులకు గాను 35 స్థానాలకు కౌంటింగ్, తొలి రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
Kakinada: తుని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం!
Kakinada: కాకినాడ జిల్లా తుని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 36 వార్డులకు గాను, ఒక వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన 35 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
తుని పట్టణంలో మొత్తం 35 వార్డులకు గాను 28,834 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కౌంటింగ్ నిమిత్తం అధికారులు మూడు ప్రత్యేక కౌంటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తొలి రౌండ్‌లో భాగంగా 1 నుండి 10 వార్డుల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరి కొద్దిసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉండటంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.




