Kakinada: నవఖండ్రవాడ విఆర్ఓపై ఫిర్యాదు అవాస్తవం: గ్రామస్తులు

Kakinada: కాకినాడ జిల్లా నవఖండ్రవాడ విఆర్ఓ పొన్నాడ రాంబాబుపై కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు అవాస్తవమని, ఆయన అందరికీ ఎంతో సేవ చేశారని గ్రామస్తులు స్పష్టం చేశారు.

RAMA KRISHNA, KKD
Updated on: 3 Aug 2026 5:25 PM IST
Kakinada
X

Kakinada: నవఖండ్రవాడ విఆర్ఓపై ఫిర్యాదు అవాస్తవం: గ్రామస్తులు

కాకినాడ జిల్లా.

పిఠాపురం నియోజవర్గం.

నవఖండ్రవాడ వి.ఆర్.ఓ.పై వచ్చిన ఫిర్యాదు అవాస్తవం ప్రజా మద్దతు తెలుపుతున్న గ్రామస్తులు

పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో వి.ఆర్.ఓ.గా పనిచేయుచున్న పొన్నాడ రాంబాబుపై పెదపాటి మమతశ్రీ పాడాలో కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు సరియైనది కాదనీ అవాస్తవమని గ్రామస్తులు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ పెద్ద నున్నం వసంతరావు మాట్లాడుతూ అదే విధంగా వి.ఆర్.ఓ.గా మా గ్రామంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన ఎవరి నుండి పైసా ఆశించలేదు.అదే విధంగా తుఫాను సమయంలో మా గ్రామంలో నవఖండ్రవాడ పంచాయితీలో ఉండి మా గ్రామ ప్రజలకు అన్ని విధాలా వసతులు ప్రభుత్వం ద్వారా అయితేనే, సోషల్ సర్వీసు వ్యక్తులతోను అన్ని విధాలా మాకు వసతులు, భోజనాలు, త్రాగునీరు అందించడం జరిగింది.అటువంటి వ్యక్తిపై పెద్దపాటి మమతశ్రీ అనే వ్యక్తి తమ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ యివ్వలేదనే అపోహపడి ఆయన పై కలెక్టర్ కు ముందు తప్పుడు రిపోర్టు ఇచ్చిందని అన్నారు.

అనంతరం గ్రామ మహిళలు మాట్లాడుతూ సుమారు ఆయన రెండు సంవత్సరాలుగా ఇదే గ్రామంలో పనిచేస్తున్నారని, అదే విధంగా మా పిల్లలు సర్వీసులోను, మా మహిళలు యొక్క దృవపత్రాలు అయితేనో సదరు వి.ఆర్.ఓ. సత్వరమే స్పందించి వెంటనే కులదృవీకరణ పత్రాలు చేయించి యిచ్చేవారు.అటువంటి మంచి అధికారిపై తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో పై అధికారులు తొందరపడి ఏ విధమైన చర్యలు తీసుకోరాదని మా గ్రామ ప్రజలందరమూ కోరి ప్రార్థించుచున్నాము అని తెలియజేశారు. ఈ ఆరోపణపై సర్వే కొచ్చిన అధికారులకు ఆయన చేసిన మంచి పనులను మరియు చాలా మంచివారిని వారికి తెలియజేయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద నున్నం వసంతరావు, సిద్ధాంత పాపారావు, గీషాల ఏసుబాబు,శీలం పాప,మరియమ్మ, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story