Peddapuram: రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన దొరబాబు!

Peddapuram: పెద్దాపురం కోర్టు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు తన కారులో ఆసుపత్రికి తరలించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 8 Oct 2026 7:00 PM IST
Peddapuram
X

Peddapuram: రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన దొరబాబు!

Peddapuram: పెద్దాపురం పట్టణం కోర్ట్ రోడ్ ఎదురుగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అశోక్ అనే వ్యక్తిని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు సకాలంలో స్పందించి తన సొంత కారులోనే ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.కోర్ట్ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతంలో జరిగిన ప్రమాదాన్ని గమనించిన దొరబాబు, వెంటనే తన వాహనాన్ని నిలిపివేశారు.తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని చూసి ఆలస్యం చేయకుండా తన సొంత కారులోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాద సంఘటన కు సంబంధించి పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM