Kakinada: కూటమి అరాచక పాలనపై హోరెత్తిన వైసీపీ పోరుబాట!
Kakinada: కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
Kakinada: కూటమి అరాచక పాలనపై హోరెత్తిన వైసీపీ పోరుబాట!
Kakinada: కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకల పై సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.వైసిపి కేంద్ర కార్యాలయం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు ఈరోజు నుండి నాలుగు రోజులపాటు చేపడుతున్నారు.
కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు కొరసాల కన్నబాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు.కురసాల కన్నబాబు మీడియా పాయింట్స్...రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నుండి అంచివేత ద్వారాలతో పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై నిష్పాక్షపక్షంగా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా డీఎస్సీ నియామకాలపై మీడియా సమావేశం నిర్వహించాలని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కారం పూర్తవుతున్న ఇప్పటివరకు నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఒక్కరికి కూడా అందించలేదని తక్షణమే నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు.




