Razole: భర్తను ఇండియాకు రప్పించండి.. చంద్రబాబుకు బాధితురాలి వేడుకోలు

Razole: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన లంకే లక్ష్మణుడు (47) గత 40 రోజులుగా కనిపించకుండా పోయాడు.

PRABHU, RAZOLE
Published on: 25 May 2026 4:32 PM IST
Razole
X

Razole: భర్తను ఇండియాకు రప్పించండి.. చంద్రబాబుకు బాధితురాలి వేడుకోలు

Razole: ఉపాధి కోసం దేశం కాని దేశాలు వెళ్లి ఎన్నెన్నో సమస్యలతో అక్కడ నరకయాతన పడుతున్నారు. కుటుంబం ఆకలి తీర్చడానికి వెళ్లి అర్ధాకలితోను, కొన్ని కొన్ని సందర్భాల్లో పస్తులుండి, చెప్పుకోవడానికి తనవారంటు ఎవరు లేక నానా అవస్థలు పడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి నుండి దుబాయ్ వెళ్లిన వ్యక్తి ఇలాగే కష్టాల్లో చిక్కుకున్నాడు.

డాక్టర్..బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి గ్రామానికి చెందిన లంకే లక్ష్మణుడు (47) కి భార్య ఇద్దరు పిల్లలు అతను చేతివృత్తి కార్పెంటర్ పని చేసుకుంటున్నా అరకొర డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవడంతో.. స్థానికంగాను సరైన ఉపాధి లేకపోవడంతో గత ఏడేళ్ల క్రితం దుబాయ్ లోని ఓక్ ఇంటర్నేషనల్ టెక్నికల్ సర్వీస్ అనే ఒక కంపెనీలో కార్పెంటర్ పని చేసెందుకు వెళ్లాడు. రెండు మూడేళ్ల కోసారి వస్తుపోతు.. చివరగా ఏడాది క్రితం ఇదే నెలలో సెలవుపై తన ఇంటికి కూడా వచ్చి వెళ్లాడు.

అయితే వెళ్లిన మూడు నెలలకే వీసా గడువు ముగిసినా కంపెనీ యజమాని వీసా రెన్యువల్ చేయకపోవడంతో అక్కడ ఉంటున్న రూమ్ కే పరిమితమై అరకొర ఆహారంతో కాలం గడిపే వాడిని, చాలా ఇబ్బందిగా ఉంటుందని తన భార్య బిడ్డలతో ఫోన్ లో మాట్లాడి బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే నలభై రోజులుగా తన భర్త నుండి ఏవిధమైన సమాచారం కాని,యోగ క్షేమాలు గాని తెలియడం లేదని,అక్కడ పనిచేసే కంపెనీ యజమాని కి ఫోన్ చేసినా ఏవిధమైన సమాధానం చెప్పడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు.అసలు తన భర్త ఏమయ్యాడో తెలియక భయబ్రాంతులకు లోనౌతున్నట్లు భార్య, కుమారుడు ఏడ్వ సాగారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్త ఆచూకీ తెలుసుకుని ఇండియాకు రప్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను భార్య,కొడుకు కన్నీటితో వేడుకుంటున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story