Kondevaram: కొండెవరం సమస్యలపై పవన్ కళ్యాణ్‌కు వినతి: మణికంఠ
Kondevaram: కొండెవరం గ్రామంలో విద్యుత్, రోడ్లు, ఆలయ నిర్మాణ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి మేడిశెట్టి మణికంఠ తీసుకెళ్లారు.
Kondevaram: కొండెవరం సమస్యలపై పవన్ కళ్యాణ్‌కు వినతి: మణికంఠ
కొండెవరం: కొండెవరం గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ వైర్ల సమస్య, మధ్యలో ఆగిపోయిన రామాలయం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అనేక సమస్యలపై గ్రామ జనసేన పార్టీ కమిటీ అధ్యక్షుడు మేడిశెట్టి మణికంఠ ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలింపజేస్తూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈ సమస్యలను కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, త్వరలోనే ఆయా సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు మార్గం చూపుతామని భరోసా ఇచ్చినట్లు మేడిశెట్టి మణికంఠ తెలిపారు.
యువతకు అవకాశం ఇచ్చి… గ్రామస్థాయి నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే వేదిక కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అని మణికంఠ తెలిపారు.
ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న మేడిశెట్టి మణికంఠ చొరవపై కొండెవరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




