Kakinada: గండేపల్లి మండల కో ఆప్షన్ సభ్యుడిగా కుంచే రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక!

Kakinada: గండేపల్లి మండల కో ఆప్షన్ సభ్యుడిగా కుంచే రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయన్ను సత్కరించి నియామకం ప్రకటించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 19 Nov 2026 9:22 AM IST
Kakinada
X

Kakinada: గండేపల్లి మండల కో ఆప్షన్ సభ్యుడిగా కుంచే రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక!

Kakinada: గండేపల్లి మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యులుగా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన దైవజనులు కుంచే రామకృష్ణ ని గండేపల్లి మండల ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుంచే రామకృష్ణ ని ఘనంగా సత్కరించి, కో ఆప్షన్ సభ్యుడిగా నియమించినట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు.

ఈ సందర్భంగా కుంచే రామకృష్ణ మాట్లాడుతూ..

పార్టీ కష్టకాలంలో పార్టీని గ్రామంలో బలోపేతం చేయడానికి కృషి చేసిన నన్ను గుర్తించి, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ , జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు జ్యోతుల నవీన్ కో ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించారని, వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మండల పరిషత్ నిధులతో, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పిటిసి సహకారంతో మండలంలోని గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఈ సందర్భంగా రామకృష్ణ గారు తెలియజేశారు.

కో ఆప్షన్ సభ్యుడిగా నియమితులైన రామకృష్ణ ని పలువురు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమంతుల నాగరత్నం, వైస్ ఎంపీపీ కందుల చిట్టిబాబు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, జాస్తి వసంత్, జడ్పిటిసి మంగిన గని లక్ష్మి శ్రీనివాస్, అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎంపీటీసీలు పాల్గొన్నారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA