Kothapalli: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నేత

Kothapalli: కొత్తపల్లి మండలం రమణక్కపేటలో మృతి చెందిన నీలం చిన్నా కుటుంబాన్ని జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

RAMA KRISHNA, KKD
Published on: 31 Aug 2026 11:59 PM IST
Kothapalli
X

Kothapalli: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నేత

కొత్తపల్లి: రమణక్కపేటలో విషాద ఘటన.. బాధిత కుటుంబానికి జనసేన అండ రమణక్కపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సి కాలనీకి చెందిన నీలం చిన్నా (60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఉప్పాడ–కొత్తపల్లి మండల ఇంచార్జ్ రావు అక్షయ్ రమణక్కపేట గ్రామంలోని నీలం చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, తన వంతు ఆర్థిక సహాయం అందిస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మురాలశెట్టి సత్తిబాబు మరియు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story