Kirlampudi: కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబానికి కుంచే రమణారావు పరామర్శ!
Kirlampudi: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణం పట్ల అమలాపురం వైసీపీ నేత కుంచే రమణారావు సంతాపం.
Kirlampudi: కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబానికి కుంచే రమణారావు పరామర్శ!
Kirlampudi: కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు.కాపు ఉద్యమ నాయకులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణం పట్ల అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన రమణారావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ముద్రగడ తనయులు ముద్రగడ బాలు,ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముద్రగడ గిరిబాబు తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్చారు.ఈ సందర్భంగా ముద్రగడతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రమణారావు, ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.
ముద్రగడ మరణం రాష్ట్రానికి,కాపు సమాజానికి తీరని లోటని పేర్కొంటూ,ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ,ఎస్టీ మోనటిరింగ్ కమిటీ సభ్యురాలు పుణ్యామంతుల రజిని, ఎంపిటిసి లలిత,మాజీ సర్పంచ్‌లు పెయ్యిల రాజ్ కుమార్,నక్క సంపత్ కుమార్, జొన్నాడ చిన్ని శ్రీదుర్గా,వేగిరాజు సాయిరాజు,తోట శ్రీను, నేలపూడి సుగంధ కుమార్, అయితాబత్తుల సూరిబాబు, పందిరి సుబ్బరాజు,పొలమూరి మోహన్,పరమట రాజశేఖర్, దేవరపల్లి నరేష్,కంచర్ల జాన్సన్,గూటం సాయి,మాకే సిద్దు,నాగారపు శ్రీను, నేరేడుమెల్లి శ్రీనివాసరావు,సాకా సూరిబాబు,ముత్తాబత్తుల శ్రీను,గణేష్,నాగరాజు, విప్పర్తి రమేష్ నూకపెయ్యి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




