Peddapuram: జనసేనలోకి భారీగా చేరికలు..ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో..!
Peddapuram: పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరారు.
Peddapuram: జనసేనలోకి భారీగా చేరికలు..ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో..!
Peddapuram: పెద్దాపురం పట్టణ పరిధి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్,డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సమక్షంలో పెద్దాపురం పట్టణానికి సంబంధించి పలువురు జనసేన పార్టీ లోకి చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మలరామస్వామి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వస్తున్న రాజకీయ మార్పునకు ఈ భారీ చేరికలే ప్రత్యక్ష సాక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం తుమ్మల బాబు మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఇస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ,రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్,యనమల కృష్ణుడు, పెద్దాపురం నియోజక వర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




