Jaggampeta: జగ్గంపేటలో ముగిసిన పోలింగ్ సామగ్రి పంపిణీ!
Jaggampeta: జగ్గంపేటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ సామగ్రి పంపిణీ పూర్తి. తుఫాన్ భయాల నడుమ ప్రశాంతంగా బ్యాలెట్ పత్రాలు అందజేసిన అధికారులు.
Jaggampeta: జగ్గంపేటలో ముగిసిన పోలింగ్ సామగ్రి పంపిణీ!
Jaggampeta: ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అధికారులు ముందడుగు వేసారు. జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యాలెట్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది.
తుఫాన్ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియను ఎక్కడా ఆపకుండా అధికారులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేసి, బ్యాలెట్ బాక్సులతో పాటు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఎవరి భయూలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.




