Tuni: లోవ తలపులమ్మ ఆలయంలో ఆషాడమాస వేడుకలు పూర్తి వివరాలు
Tuni: జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు లోవ తలపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాడమాస పూజలు. ప్రత్యేక కార్యక్రమాలు, భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్ల వివరాలు ఇవే.
Tuni: లోవ తలపులమ్మ ఆలయంలో ఆషాడమాస వేడుకలు పూర్తి వివరాలు
తుని: కాకినాడ జిల్లా లోవ శ్రీ తలపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాడమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జూలై 15 నుంచి ఆగస్టు 12, 2026 వరకు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని దేవస్థాన ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి పెన్నెత్య విశ్వనాథరాజు తెలిపారు.
నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమాలు:
జూలై 17: 1008 కుండలతో పెళ్లి కాని అమ్మాయిలచే కుంకుమ అర్చన. స్థానిక ఎమ్మెల్యే చే ప్రారంభం.
చండీహోమం.
జూలై 19: మొదటి ఆదివారం ముట్టిగాజలతో అమ్మవారి అలంకరణ.
జూలై 22: అమ్మవారి స్వతి నక్షత్రం సందర్భంగా పంచామృతాభిషేకం.
జూలై 24: శుద్ధ ఏకాదశి సందర్భంగా లక్షతులసి పూజ.
జూలై 26: లక్షకుంకుమార్చన.
జూలై 29: పూర్ణాహుతి సందర్భంగా చండీహోమం.
జూలై 31: తోటనంబూరు వారిచే చండీహోమం.
ఆగస్టు 2: వివిధ రకాల కూరగాయలతో శాకంభరీ దేవిగా అలంకరణ మరియు శ్రీ గణపతి స్వామికి లక్ష గరిక పూజ.
ఆగస్టు 9: బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ మరియు లక్ష పుష్పార్చన.
ఆగస్టు 11 & 12: సప్త నదుల జలాలతో అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం.
భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు:
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, పోలీస్ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తులందరికీ మంచి నీటి సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆలయ పరిధిలో వస్తువుల విక్రయాలను ఎం.ఆర్.పి (M.R.P) ధరలకే విక్రయించాలని దేవస్థాన అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. భక్తులందరూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము




