Kakinada: సామర్లకోటలో ఘోర అగ్నిప్రమాదం.. బూడిదైన పలు దుకాణాలు!
Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోట బల్ల మార్కెట్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం. 5-6 చిన్న వ్యాపార దుకాణాలు దగ్ధం.
Kakinada: సామర్లకోటలో ఘోర అగ్నిప్రమాదం.. బూడిదైన పలు దుకాణాలు!
కాకినాడ జిల్లా: సామర్లకోట బల్ల మార్కెట్ సెంటర్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించి పలు కుటుంబాల జీవనోపాధి బూడిదైంది. ప్రమాదంలో టీ, కాఫీ దుకాణాలు, సెలూన్ షాపు, పొగాకు దుకాణం సహా సుమారు ఐదు నుంచి ఆరు చిన్న వ్యాపార దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానిక యువకులు కూడా అగ్నిమాపక సిబ్బందికి సహకరిస్తూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
రోజువారీ ఆదాయంపైనే ఆధారపడి జీవించే చిన్న వ్యాపారులు తమ దుకాణాలు పూర్తిగా కాలిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.




