Peddapuram: మరిడమ్మ అమ్మవారి జాతర వైభవం: 37 రోజుల పాటు ఉత్సవాలు!

Peddapuram: సోమవారం (జులై 13) నుంచి ఆగస్టు 19 వరకు 37 రోజుల పాటు శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 13 July 2026 12:28 PM IST
Peddapuram
X

Peddapuram: మరిడమ్మ అమ్మవారి జాతర వైభవం: 37 రోజుల పాటు ఉత్సవాలు!

Peddapuram: సోమవారం నుంచి ప్రారంభమయ్యే మరిడమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 13 నుంచి ఆగస్టు19వ తేదీ వరకు మొత్తం 37 రోజుల పాటు జాతర వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు.

జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గంగమ్మ పూజలు, గ్రామోత్సవాలు, వేదపారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రసాద విక్రయాలు, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

అదేవిధంగా, బాలలు, వృద్ధులు, మహిళల భద్రత కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఆలయ అధికారుల సూచనలు పాటిస్తూ జాతరను విజయవంతం చేయాలని కోరారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story