Pithapuram: పిఠాపురంలో ర్యాలీ.. ఎర్రజెండా ఆవిష్కరించిన కార్మిక నేతలు

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

RAMA KRISHNA, KKD
Published on: 1 May 2026 4:25 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో ర్యాలీ.. ఎర్రజెండా ఆవిష్కరించిన కార్మిక నేతలు

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.. ఈరోజు మే డే సందర్భంగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా ఉప్పాడ బస్టాండ్ వరకు వెళ్లి అక్కడ సి ఐ టియు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కన్వీనర్ కే చిన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక హక్కు చట్టాలు తీసేసి కేవలం నాలుగే లేబర్ కోడ్స్ గా చేసి కార్మికులను మరింత పని గంటలు చేయాలనే నిర్ణయం తీసుకురావడానికి కార్మికులంతా వ్యతిరేకిస్తున్నారని,బ్రిటిష్ వారి కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు.

యధావిధిగా కొనసాగించాలని అలాగే ప్రతి ఒక్క కార్మికులకు కనీస వేతనం కింద 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తించాలని భవన నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య పెన్షన్, వారు పిల్లలకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని బీసీలకు లోన్లు ఇవ్వాలని రిక్షా కార్మికులకు రిక్షా మోటర్లు ఉచితంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇవ్వాలని ప్రభుత్వ సంఘ సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని, కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సీతారామరాజు కార్మికులకు మద్దతు తెలియజేశారు. పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు కోనేటి రాజు నాగేశ్వరరావు, పి, వీరబాబు, కే మణి, శ్రీమంతుల, సత్తిబాబు, కొల్లు రాజారావు, అంగన్వాడి నాయకులు, విజయశాంతి, వెంకటలక్ష్మి, బేబీ, డి సత్యనారాయణ, గోవిందు, సూర్యనారాయణ, సోమేశ్వరరావు ,బి కామిరెడ్డి ఈశ్వర్ రెడ్డి,లోవరాజు, కే విశ్వనాథం, మోహనాచార్యులు, పి ప్రకాష్, సూర్యచక్రం సత్యనారాయణ, గాంధీ ఎస్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD

Next Story