Kakinada: జెడ్ రాగంపేటలో దద్దరిల్లిన కూటమి ప్రచార సభ.. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరు!
Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జెడ్ రాగంపేటలో కూటమి ప్రచార సభ ఘనంగా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారీటీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Kakinada: జెడ్ రాగంపేటలో దద్దరిల్లిన కూటమి ప్రచార సభ.. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరు!
Kakinada: గండేపల్లి మండలం జెడ్ రాగం పేట లో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ వైస్ ఎంపీపీ అభ్యర్థి కందుల చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సమన్వయ సభ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నిక లకు జడ్ రాగంపేట నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభం నిర్వహిస్తున్నామని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గండేపల్లి మండల ఎంపీపీ అభ్యర్థి శ్రీమంతుల నాగరత్నంకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. అదేవిధంగా జెడ్పీటీసీ అభ్యర్థి జనసేన పార్టీ గని లక్ష్మిని గాజు గ్లాస్ గుత్తిపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని పిలుపునిచ్చారు.
శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన మీకు ఇప్పటివరకు చేసింది తక్కువ. రేపు రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా గండేపల్లి మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెడతాం.
రాష్ట్రంలో కేంద్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ పాలన సాగిస్తుందని ఇంటికి స్థానిక సంస్థల నుండి ఈ బండికి ఇంకో రెండు బోగీలు తగిలిస్తే ఇంకా గ్రామాలు మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు
గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరేలా చూస్తాం. యువతకు ఉపాధి, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తాం" అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, అడబాల భాస్కర్ రావు, ఎంపీపీ అభ్యర్థి శ్రీమంతుల నాగరత్నం, కందుల కొండయ్య చౌదరి,, కందుల గోవిందు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.




