Jaggampeta: రూ.6.33 కోట్ల రక్షిత మంచి నీటి పథకం ప్రారంభం!
Jaggampeta: జగ్గంపేటలో జల జీవన్ మిషన్ ద్వారా రూ. 633.94 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, టిడిపి నేత జ్యోతుల నెహ్రూ.
Jaggampeta: రూ.6.33 కోట్ల రక్షిత మంచి నీటి పథకం ప్రారంభం!
Jaggampeta: కాకినాడ జిల్లాజగ్గంపేట ఆగస్టు 11: స్థానిక గోకవరం రోడ్డులోని అన్నపూర్ణ పౌష్టికాంప్లెక్స్ కోళ్ల ఫారాల వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో జల జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన ఈ పథకానికి అంచనా వ్యయం రూ. 633.94 లక్షలు. జగ్గంపేట గ్రామ పంచాయతీ పరిధిలో రక్షిత మంచినీటి ట్యాంక్ ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు.
పథకం ప్రారంభోత్సవం అనంతరం జ్యోతుల నెహ్రూ మహిళల వద్దకు వెళ్లి స్వయంగా బిందెలతో నీటిని పట్టి అందించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చామని ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఈ రక్షిత మంచినీటి పథకం కీలకంగా ఉపయోగపడుతుందని ఇక్కడే 150000 లీటర్ల సామర్థ్యం గల మరో వాటర్ ట్యాంక్ శిధిల మోడల్ జరిగిందని అక్కడ మళ్ళీ శుద్ధి చేసిన మంచినీరు అందించే విధంగా తొందరలోనే వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడతామని జగ్గంపేట మంచినీటి చెరువుకి భావారం ఫిల్టర్ వాటర్ ద్వారా నీటిని ప్యూరిఫై చేసి ప్రతి ఇంటికి త్రాగు నీటికే కాకుండా ప్రతి అవసరానికి శుద్ధి చేసిన మంచినీళ్లు అందించే చర్యలు చేపడతానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.
ఈ కార్యక్రమంలో జీనుమణి బాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పైడిపాల సూరిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, పాండ్రంగి రాంబాబు, రాయి సాయి, వేములకొండ జోగారావు, పీల మహేష్, నండ్ల చిరంజీవి, ఎంపీడీవో చంద్రశేఖర్, కాంట్రాక్టర్ శ్రీనివాస్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీర్ రాంజీ, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




